
108లో కవలల జననం
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి 108 వాహనంలోనే కవలకు జన్మనిచ్చింది.
హయత్‌నగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి 108 వాహనంలోనే కవలకు జన్మనిచ్చింది. నెలలు గడవక ముందు పుట్టిన శిశువుల పరిస్థితి విషమంగా ఉంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... తట్టిఅన్నారం లక్ష్మీగణపతి కాలనీకి చెందిన లక్ష్మమ్మ భార్య చంద్రకళ ఏడు నెలల గర్భిణి. అయితే, ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు.
వెంటనే చేరుకున్న 108 సిబ్బంది చంద్రకళను అంబులెన్స్‌లో ఎక్కించారు. నొప్పులు తీవ్రం కావడంతో సిబ్బంది వాహనంలోనే కాన్పు చేశారు. ఇద్దరు మగశిశువులు జన్మించారు. నెలలు నిండకుండానే జన్మించడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని, తల్లీబిడ్డలను గాంధీ ఆసుపత్రిలో చేర్పించామని ఈఎండీ కృష్ణప్రసాద్, పైలట్ రాజు తెలిపారు.