టీఏఎస్‌ ఏర్పాటుకు అధ్యయనం | Study to form the TAS | Sakshi
Sakshi News home page

టీఏఎస్‌ ఏర్పాటుకు అధ్యయనం

May 26 2017 3:18 AM | Updated on Nov 9 2018 5:56 PM

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (టీఏఎస్‌) రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు రాష్ట్ర బృందం  
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (టీఏఎస్‌) రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్‌–1 అధికారుల సంఘం, తెలంగాణ రెవెన్యూ జేఏసీ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు వివిధ రాష్ట్రాల పర్యటనకు తెలంగాణ ఎన్జీవో సెంట్రల్‌ యూనియన్‌ ప్రతినిధులకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. టీఏసీలో కేడర్‌ సంఖ్య ప్రతిపాదనలు, టీఏసీ పరిధిలో ఉంచాల్సిన హెచ్‌వోడీలు, పోస్టులు, పోస్టుల వారీగా  గ్రేడ్, స్కేల్‌ ఆఫ్‌ పే వివరాలు, టీఏసీ, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీకి అధికారుల ఎంపిక, ఎంపిక విధానం, టీఏసీల పదోన్నతుల విధానం, ప్రస్తుతం ఉన్న గ్రూప్‌–1 అధికారులను టీఏసీలో చేర్చటం, టీఏసీ అధికారులకు శిక్షణ, తరగతుల నిర్వహణ తదితర అంశాలను కూడా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement