స్టార్‌‌ వార్! | Sakshi
Sakshi News home page

స్టార్‌‌ వార్!

Published Mon, Dec 8 2014 12:24 AM

స్టార్‌‌ వార్!

తమిళ తంబీలు విజయ్, అజిత్‌ల మధ్య అంతంత మాత్రంగా ఉన్న రిలేషన్‌కు ఓ చిన్న పోస్ట్‌తో మరింత పొగబెట్టాడో తుంటరి. దానికి ఏ సంబంధం లేని దర్శకుడు కేవీ ఆనంద్‌ను రింగ్ మాస్టర్‌ను చేసేసి చేతులు దులుపుకున్నాడు. విషయం సామాజిక సైట్ దాటి... హీరోల అభిమానులకు చేరి... పరిస్థితి చేతులు దాటిపోయిందట.

విషయమేమంటే... విజయ్ 60వ సినిమా కేవీ ఆనంద్ చేస్తున్నాడంటూ ఓ పోస్టర్‌ను ఆనంద్ వాల్‌పై పోస్ట్ చేశాడు ఆ తుంటరి. దీంతో నిప్పు రాజుకుంది. దీనిపై ఆనంద్... ‘అది ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టింది. నాకెలాంటి సంబంధం లేదు. దాన్ని వెంటనే డిలీట్ చేశా. ఇద్దరూ నాకు మంచి మిత్రులు’ అంటూ
 వివరణ ఇచ్చుకున్నాడు.
 

Advertisement
Advertisement