విజ్ఞాన్ అధ్యాపకునికి విశిష్ట గౌరవం | Significant respect to the faculty of Vigyan | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్ అధ్యాపకునికి విశిష్ట గౌరవం

Jul 4 2014 2:46 AM | Updated on Apr 6 2019 8:49 PM

విజ్ఞాన్ అధ్యాపకునికి విశిష్ట గౌరవం - Sakshi

విజ్ఞాన్ అధ్యాపకునికి విశిష్ట గౌరవం

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కోయ ప్రభాకరరావు జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ సాయంతో చేసిన పరిశోధనలకు విశిష్ట గౌరవం లభించింది.

 అంతర్జాతీయ జర్నల్‌లో పరిశోధనా పత్రం

 చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో  సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కోయ ప్రభాకరరావు జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ సాయంతో చేసిన పరిశోధనలకు విశిష్ట గౌరవం లభించింది. ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం అంతర్జాతీయంగా ఎంతో పేరు ఉన్న 13.7 చాప్టర్ జర్నల్ ‘అన్‌గెవాండిటెకెమీ’ లో ప్రచురితమైంది. ఈ విషయం గురువారం ఆయన విలేకరులకు తెలిపారు. 

తామరాకుపై నీరు నిలవని అంశం ఆధారంగా  పెయింట్స్, రూఫ్‌టైల్స్ వంటి వాటి తయారీలో నీటిని వేరుచేసే విధానాన్ని తన పత్రాల్లో  వెల్లడించారు. ఈ పద్ధతి ద్వారా సముద్రంలో ఆయిల్స్ లీక్ అయినపుడు ఆ నీటి నుంచి ప్రమాదకర రసాయనాలను వేరు చేయవచ్చునని తెలిపారు. ప్రభాకరరావును విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ రత్తయ్య తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement