రెండు జిల్లాల్లో ‘ఎస్సై’ పరీక్షా కేంద్రాల మార్పు | SI Exam centers chenged in two districts | Sakshi
Sakshi News home page

రెండు జిల్లాల్లో ‘ఎస్సై’ పరీక్షా కేంద్రాల మార్పు

Jun 24 2016 3:27 AM | Updated on Sep 17 2018 6:18 PM

సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) దేహదారుఢ్య పరీక్షలకు రెండు జిల్లాల్లో కేంద్రాల వేదికలను మార్చినట్లు...

సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) దేహదారుఢ్య పరీక్షలకు రెండు జిల్లాల్లో కేంద్రాల వేదికలను మార్చినట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (పీఆర్‌బీ) చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి జరగనున్న దేహదారుఢ్య పరీక్షలకు వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేదికలను పీఆర్‌బీ మార్చింది. వరంగల్‌లో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియానికి మార్చారు. అలాగే నల్లగొండ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియానికి వేదికను మార్చినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement