‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం నేడే | sakshi excellence awards distribution today | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం నేడే

Apr 24 2016 2:56 AM | Updated on Aug 20 2018 8:20 PM

సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించే లక్ష్యంతో సాక్షి సంస్థ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ ఇస్తున్న విషయం తెలిసిందే

సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించే లక్ష్యంతో సాక్షి సంస్థ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తూ వస్తోంది.

ఇది కేవలం ప్రతిభకు సత్కారం మాత్రమే కాదు.
ముందు తరాల ఔత్సాహికులకు ఒక స్ఫూర్తి కూడా.

తొలిసారి 2014 సంవత్సరానికి ఎక్సలెన్స్ అవార్డులను 2015 మే 16న సాక్షి ప్రదానం చేసింది. అదేవిధంగా 2015 సంవత్సరానికి గాను నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డులను బహుకరిస్తోంది. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవిత సాఫల్య పురస్కారం అందుకుంటారు. అలాగే సుప్రసిద్ధులైన న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన పలు రంగాల్లోని ప్రముఖులు, నిష్ణాతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌లతో సహా పలువురు అతిథులు ఈ వేడుకకు హాజరవుతారు.

ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్‌మెంట్-ఎన్జీవో, ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్, ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-స్మాల్/మీడియం స్కేల్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-సోషల్ సర్వీస్ వంటి పలు విభాగాల్లో ఈ అవార్డులను సాక్షి అందజేస్తోంది. వీటితోపాటు సినిమా విభాగంలో కూడా పది పాపులర్ అవార్డులు ప్రదానం చేస్తోంది.
 
సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు, ముందు తరాల వారికి స్ఫూర్తినిచ్చేందుకు పాటుపడుతున్నవారి మార్గదర్శకత్వంలో మెరుగైన రేపటి దిశగా ముందడుగు వేయడమే సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల లక్ష్యం.. ధ్యేయం.

సాక్షి!
సత్యమేవ జయతే
సాక్షి!
రేపటికి ముందడుగు
సాక్షి!
ప్రతిభకు పట్టం

Advertisement
 
Advertisement
Advertisement