రెవెన్యూలో ప్రజా పోర్టల్ | Revenue in the public portal | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో ప్రజా పోర్టల్

Feb 17 2016 12:26 AM | Updated on Oct 8 2018 7:48 PM

రెవెన్యూలో ప్రజా పోర్టల్ - Sakshi

రెవెన్యూలో ప్రజా పోర్టల్

రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంపొందించేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) చర్యలు చేపట్టారు.

నేడు ఆవిష్కరించనున్న మహమూద్ అలీ

 సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంపొందించేందుకు భూ పరిపాలన  ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) చర్యలు చేపట్టారు.తమ భూమి రికార్డుల కోసం యజమానులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాలు, ‘మీ సేవా’ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రాష్ట్రంలోని  ఏప్రాంతంలో ఉండే రైతు అయినా తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఇట్టే చూసుకునేలా కొత్తగా ‘మా భూమి’ ప్రజా పోర్టల్‌ను సీసీఎల్‌ఏ రూపొందించారు. ‘మా భూమి’ పోర్టల్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆవిష్కరిస్తారు. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సీసీఎల్‌ఏ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement