నయీం డైరీ పేరుతో బురదచల్లాలని చూస్తే సహించేది లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
అసలు ఉందో లేదో తెలియని గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని అడ్డం పెట్టుకుని తమ పార్టీకి చెందిన నేతలపై బురద చల్లి బెదిరించాలని చూస్తే సహించేది లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ డైరీ గురించి పత్రికల్లో వార్తలు రావడమే తప్ప అతని డైరీ ఉందని కాని, అందులో కొందరి పేర్లు ఉన్నాయని కాని అధికారికంగా సిట్ అధికారులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. డైరీ నిజంగానే ఉంటే దానిని ప్రభుత్వం సీజ్ చేసి, అందులో ఉన్న నిందితుల పేర్లను అధికారికంగాప్రకటించాలన్నారు. టీడీపీ నేతలపై బురదచల్లి, బెదిరించి, లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే కథనాలు వస్తున్నాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో కొందరు విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.