పాతవి రద్దు.. కొత్త వాటికి ఆమోదం! | Re-engineering projects on 2nd in front of cabinet | Sakshi
Sakshi News home page

పాతవి రద్దు.. కొత్త వాటికి ఆమోదం!

Feb 1 2017 12:13 AM | Updated on Oct 2 2018 4:36 PM

రాష్ట్రంలో రీ ఇంజనీరింగ్‌ చేస్తున్న సాగునీట ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • 2న కేబినెట్‌ ముందుకు రీ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులు
  • మల్లన్నసాగర్‌ సహా నాలుగు రిజర్వాయర్లకు ఆమోదం తెలిపే అవకాశం
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రీ ఇంజనీరింగ్‌ చేస్తున్న సాగునీట  ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీ ఇంజనీరింగ్‌తో రద్దయిన పనులను తొల గించడం, కొత్త వాటికి అనుమతి, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నెల 2న జరిగే కేబినెట్‌ సమావేశంలో రీ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. కేబినెట్‌లో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరిం గ్‌తో సవరణల భారం అదనంగా రూ.34 వేల కోట్లకు వరకు ఉండనుండగా, దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.  4 రిజర్వాయర్లపై ప్రకటన?..

    మల్లన్నసాగర్‌ సహా మరో 4 రిజర్వాయర్లపై కేబినెట్‌లో కీలక నిర్ణయం చేసే అవకాశం ఉంది. 50 టీఎంసీల మల్లన్న సాగర్‌కు రూ.7,308 కోట్లు, 3 టీఎంసీల రంగనాయక సాగర్‌ను రూ.550 కోట్లు, 7 టీఎంసీల కొండ పోచ మ్మకు రూ.521.50 కోట్లు, 9.86 టీఎంసీల గంధమలకు రూ.8 98.50 కోట్లు, 11.39 టీఎంసీల బస్వా పూర్‌కు రూ.1803 కోట్ల తో అంచనాలు సిద్ధమయ్యాయి. వీటికి మొత్తంగా రూ.11,081 కోట్ల అంచనా వేయగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనిపై కేబినెట్‌ లో ఆమోదం తెలిపి అనం తరం అధికారిక ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement