'కేసీఆర్ స్వార్థం వల్లే అడ్వకేట్లు రోడ్డున పడుతున్నారు'
మెదక్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం మెదక్లో నిప్పులు చెరిగారు. కేసీఆర్, చంద్రబాబు చీకటి ఒప్పందం వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ధర్నా చేయడం కాదు చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. కేసీఆర్ స్వార్థం వల్లే అడ్వకేట్లు రోడ్డున పడుతున్నారని విమర్శించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి