'కేసీఆర్... హైదరాబాద్ సెటిలర్లకు క్షమాపణలు చెప్పు' | Ponnala Lakshmaiah takes on Congress Party | Sakshi
Sakshi News home page

'కేసీఆర్... హైదరాబాద్ సెటిలర్లకు క్షమాపణలు చెప్పు'

Apr 19 2014 1:19 PM | Updated on Apr 7 2019 3:34 PM

'కేసీఆర్... హైదరాబాద్ సెటిలర్లకు క్షమాపణలు చెప్పు' - Sakshi

'కేసీఆర్... హైదరాబాద్ సెటిలర్లకు క్షమాపణలు చెప్పు'

తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడు వెంపర్లాడలేదని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.

తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడు వెంపర్లాడలేదని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణలో నివసిస్తున్న ఇతర ప్రాంతాలవారిని రెచ్చగొట్టింది....వారిలో అభద్రతభావం కల్పించింది కేసీఆరే అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆందోళన పరిస్థితులు కల్పించి... రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది కేసీఆర్ ఆని పొన్నాల విమర్శించారు.

 

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో సెటిలర్ల ఓట్లు తమ పార్టీకి పడవని కేసీఆర్కు అర్థమైందని... అందుకే ఆయనలో ఓ విధమైన ఆసూయ మొదలైందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ విమర్శిస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో సెటిలర్లకు క్షమాపణలు చెప్పాలని ఈ సందర్బంగా కేసీఆర్ను పొన్నాల డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement