ఆ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలి | Padma chary to requests to bring Telangana secretariat employees | Sakshi
Sakshi News home page

ఆ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలి

Jun 21 2016 1:53 AM | Updated on Aug 18 2018 8:27 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణకి చెందిన 3, 4 తరగతుల ఉద్యోగులను కూడా రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర సచివాలయ సంఘం అధ్యక్షుడు పద్మాచారి విజ్ఞప్తిచేశారు.

- తెలంగాణ సచివాలయ సంఘం
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణకి చెందిన 3, 4 తరగతుల ఉద్యోగులను కూడా రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర సచివాలయ సంఘం అధ్యక్షుడు పద్మాచారి విజ్ఞప్తిచేశారు. సచివాలయంలో పనిచేస్తున్న 64 మందికి ఎస్‌ఓలుగా పదోన్నతి కల్పించడం పట్ల టీఎన్జీవో నేత శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

సోమవారం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో స్థానికత ఉంటే  ఆ రాష్ట్రానికే ఉద్యోగులను పంపించాలని కోరారు. తెలంగాణ ఆప్షన్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులను ఇక్కడ అనుమతించొద్దన్నారు. ఆప్షన్ల పేరిట, కమల్‌నాథన్ కమిటీ పేరిట వచ్చే వారికి వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement