తెరపైకి నిర్మల్ జిల్లా! | Nirmal district to the fore! | Sakshi
Sakshi News home page

తెరపైకి నిర్మల్ జిల్లా!

Jul 1 2016 3:08 AM | Updated on Aug 14 2018 10:59 AM

తెరపైకి నిర్మల్ జిల్లా! - Sakshi

తెరపైకి నిర్మల్ జిల్లా!

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 24 జిల్లాల ముసాయిదాలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

- కేసీఆర్‌కు ఆదిలాబాద్ నేతల విజ్ఞప్తి
- కసరత్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
- ముసాయిదాలో మండలాల మార్పులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 24 జిల్లాల ముసాయిదాలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని కొత్త మండలాల ప్రతిపాదనలతో పాటు.. సరిహద్దుల్లో ఉన్న మండలాలను అటుదిటుగా కలపాలన్న డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం తాజా ముసాయిదా రూపొందించింది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మల్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ జిల్లా నేతలు చేసిన సూచనల మేరకు సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కొత్త జిల్లాలకు సంబంధించిన జాబితా ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులోని ప్రతిపాదనల ప్రకారం కొత్త జిల్లాల్లో పొందుపరిచిన మండలాల వివరాలివీ..

 ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్, బేల, జైనథ్ మండలాలు; ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జైనూర్, నార్నూర్ మండలాలు; బోథ్ నియోజకవర్గంలో బజార్ హత్నూర్, బోథ్, గుడి హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, తలమడుగు, తాంసి మండలాలు; ఖానాపూర్ నియోజకవర్గంలో కడెం (పెద్దూరు), ఖానాపూర్, ఇంద్రవెళ్లి, ఉట్నూరు మండలాలు; ముథోల్ నియోజకవర్గంలో భైంసా, కుబీర్, కుంతాల, లోకేశ్వరం, ముథోల్, తానూరు మండలాలు; నిర్మల్ నియోజకవర్గంలో దిలావర్‌పూర్, లక్ష్మణ్‌చాందా, మాందా, నిర్మల్, శ్రీరంగాపూర్ మండలాలు ఉన్నాయి.

 కొమురం భీం జిల్లా: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, రెబ్బన, జైనూరు, కెరమెరి, సిర్పూర్ (యు), తిర్యాణి, వాంకిడి మండలాలు; బెల్లంపల్లి నియోజకవర్గంలో బీమిని, తాండూరు, బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, వేమన్‌పల్లి మండలాలు; చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు, జైపూర్, కోటవల్లి, మందమర్రి మండలాలు; మంచిర్యాలలో దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలు; సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూరు, దహెగాం, కాగజ్‌నగర్, కౌతాల, సిర్పూర్ (టి) మండలాలు ఉన్నాయి.

 కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట నియోజకవర్గంలో చంద్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి మండలాలు; భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలు; కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం, పాల్వంచ మండలాలు; పినపాక నియోజకవర్గంలో గుండాల, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాలు; వైరా నియోజకవర్గంలో సింగరేణి మండలం; ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లి, ఇల్లందు మండలాలు ఉన్నాయి.

 హైదరాబాద్ జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు; కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్, మాడ్గుల మండలాలు; మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు, మహేశ్వరం, సరూర్‌నగర్ మండలాలు; రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలు; అంబర్‌పేట నియోజకవర్గంలో అంబర్‌పేట మండలం; నాంపల్లి నియోజకవర్గంలో బహదూర్‌పుర, బండ్లగూడ మండలాలు; చార్మినార్ నియోజకవర్గంలో చార్మినార్ మండలం; కార్వాన్ నియోజకవర్గంలో గోల్కొండ మండలం; ఖైరతాబాద్ నియోజకవర్గంలో హిమాయత్‌నగర్ మండలం; ముషీరాబాద్ నియోజకవర్గంలో ముషీరాబాద్ మండలం; నాంపల్లి నియోజకవర్గంలో నాంపల్లి మండలం; మలక్‌పేట నియోజకవర్గంలో సైదాబాద్ మండలం ఉన్నాయి.

 సికింద్రాబాద్ జిల్లా: మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్కాజిగిరి మండలం; మేడ్చల్ నియోజకవర్గంలో ఘట్‌కేసర్, కీసర, మేడ్చల్, శామీర్‌పేట మండలాలు; పటాన్‌చెరు నియోజకవర్గంలో రామచంద్రాపూర్ మండలం; కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ మండలం; శేరిలింగంపల్లి నియోజకవర్గంలో     శేరిలింగంపల్లి మండలం; ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ మండలం; బాలానగర్ నియోజకవర్గంలో కూకట్‌పల్లి మండలం; సనత్‌నగర్ నియోజకవర్గంలో అమీర్‌పేట మండలం; ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ మండలం; సికింద్రాబాద్ నియోజకవర్గంలో మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ మండలాలు; జూబ్లీహిల్స్‌లో షేక్‌పేట మండలం; కంటోన్మెంట్ నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం ఉన్నాయి.    

 రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల, మొహినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి, నవాబ్‌పేట మండలాలు; కొడంగల్ నియోజకవర్గంలో బొంరాస్‌పేట, దౌలతాబాద్, కొడంగల్    మండలాలు; పరిగి నియోజకవర్గంలో దోమ, గండేడ్, కుల్కచర్ల, పరిగి, పూడూరు మండలాలు; తాండూరు నియోజకవర్గంలో బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, యేలాల్ మండలాలు; వికారాబాద్ నియోజకవర్గంలో బంట్వారం, ధరూర్, మర్పల్లి, మోమిన్‌పేట, వికారాబాద్ మండలాలు ఉన్నాయి.

 యాదాద్రి జిల్లా: ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు, ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం, గుండాల, ఎం.తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాలు; భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాలు; స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లింగాల ఘనపూర్ మండలం; జనగాం నియోజకవర్గంలో బచ్చన్నపేట, జనగాం మండలాలు; నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలం; పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూరు మండలం ఉన్నాయి.

 నిజామాబాద్ జిల్లా: ఆర్మూరు నియోజకవర్గంలో ఆర్మూరు, మాక్లూరు, నందిపేట మండలాలు; బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడు, వేల్పూరు మండలాలు; బోధన్ నియోజకవర్గంలో బోధన్, రెంజల్, ఎడపల్లి, నవీపేట    మండలాలు; నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ధర్‌పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, నిజామాబాద్, సిరికొండ మండలాలు ఉన్నాయి.

 కామారెడ్డి జిల్లా: బాన్స్‌వాడ నియోజకవర్గంలో బాన్స్‌వాడ, బీర్కూరు, కోటగిరి, వర్ని మండలాలు; జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద, జుక్కల్, మద్నూరు, నిజాంసాగర్, పిట్లం మండలాలు; కామారెడ్డి నియోజకవర్గంలో బిక్నూర్, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి మండలాలు; ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి, లింగంపేట, సదాశివనగర్, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాలు ఉన్నాయి.

 కరీంనగర్ జిల్లా: చొప్పదండి నియోజకవర్గంలో చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాలు; కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ మండలం; మానకొండూరు నియోజకవర్గంలో బెజ్జంకి, మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్ మండలాలు; హుస్నాబాద్ నియోజకవర్గంలో చిగురుమామిడి మండలం; పెద్దపలిలో ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాలు; రామగుండం నియోజకవర్గంలో రామగుండం మండలం ఉన్నాయి.

 జగిత్యాల జిల్లా: చొప్పదండి నియోజకవర్గంలో కొడిమ్యాల, మల్యాల మండలాలు; ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం, వెల్గటూరు మండలాలు; జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాలు; కోరుట్ల నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మల్లాపూర్, మెట్‌పల్లి మండలాలు; వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్, మేడిపల్లి మండలాలు ఉన్నాయి.    

 సిరిసిల్ల జిల్లా: చొప్పదండి నియోజకవర్గంలో బోయినపల్లి, మానకొండూరు నియోజకవర్గంలో ఇల్లంతకుంట, సిరిసిల్ల నియోజకవర్గంలో గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలు; వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి, కోనరావుపేట, వేములవాడ మండలాలు ఉన్నాయి.

 ఖమ్మం జిల్లా: ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్, మధిర నియోజకవర్గంలో బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాలు; పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలు; సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు మండలాలు; వైరాలో కొణిజెర్ల, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు మండలాలు, ఇల్లందులో కామేపల్లి, కారేపల్లి మండలాలు ఉన్నాయి.

 వరంగల్ జిల్లా: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్, స్టేషన్ ఘన్‌పూర్, రఘునాథపల్లి, జాఫర్‌ఘడ్ మండలాలు; హుస్నాబాద్‌లో బీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు; హుజురాబాద్‌లో హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాలు; జనగాంలో నర్మెట్ట మండలం; నర్సంపేటలో చెన్నరావుపేట, దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ మండలాలు; పాలకుర్తిలో    పాలకుర్తి, రాయిపర్తి మండలాలు; పరకాలలో పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగం మండలాలు; వర్ధన్నపేటలో హన్మకొండ, హసన్‌పర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలు, వరంగల్ నియోజకవర్గంలో వరంగల్ మండలం ఉన్నాయి.

 ఆచార్య జయశంకర్ జిల్లా (భూపాలపల్లి): భూపాలపల్లి నియోజకవర్గంలో    భూపాలపల్లి, చిట్యాల, ఘనపూర్(ములుగు), మొగుళ్లపల్లి, రేగొండ, శాయంపేట మండలాలు; ములుగులో ఏటూరు నాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపూర్ మండలాలు; మంథనిలో కాటారం, మహదేవ్‌పూర్, మల్హర్‌రావు, ముత్తారం(మ.పూర్) మండలాలు ఉన్నాయి.

 మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట మండలాలు; మహబూబాబాద్‌లో కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు, గూడూరు మండలాలు; ములుగులో కొత్తగూడ, పాలకుర్తిలో తొర్రూరు, కొడకండ్ల మండలాలు; ఇల్లందులో బయ్యారం, గార్ల మండలాలు ఉన్నాయి.

 నాగర్‌కర్నూల్ జిల్లా: అచ్చంపేట నియోజకవర్గంలో వంగూరు, అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాలు; కల్వకుర్తిలో కల్వకుర్తి, తలకొండపల్లి, వెల్దండ మండలాలు; కొల్లాపూర్‌లో కోడేరు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల మండలాలు; నాగర్‌కర్నూల్‌లో బిజినెపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాలు ఉన్నాయి.

 నల్లగొండ జిల్లా: దేవరకొండ నియోజకవర్గంలో చందంపేట, దేవరకొండ, గుండ్లపల్లి(డిండి), పెద్దఅడిశెర్లపల్లి, చింతపల్లి మండలాలు; మునుగోడులో చౌటుప్పల్, చండూరు, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, నారాయణ్‌పూర్ మండలాలు; నాగార్జునసాగర్‌లో అనుముల, నిడమనూర్, పెద్దవూర, త్రిపురారం, గుర్రంపోడు మండలాలు; నకిరేకల్‌లో చిట్యాల, కట్టంగూర్, కేతెపల్లి, నకిరేకల్, నార్కట్‌పల్లి మండలాలు; నల్లగొండలో కనగల్, నల్లగొండ, తిప్పర్తి మండలాలు; తుంగతుర్తిలో శాలిగౌరారం; మిర్యాలగూడలో    మిర్యాలగూడ, వేములపల్లి, దామరచెర్ల మండలాలు ఉన్నాయి.

 సూర్యాపేట జిల్లా: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి, హుజూర్‌నగర్, మఠంపల్లి, నేరెడుచర్ల, మేళ్లచెర్వు    మండలాలు; కోదాడలో చిలుకూరు, కోదాడ, మోతె, మునగాల, నడిగూడెం మండలాలు; సూర్యాపేటలో ఆత్మకూరు(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్, సూర్యాపేట మండలాలు; తుంగతుర్తిలో జాజిరెడ్డిగూడెం, నూతన్‌కల్, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలు ఉన్నాయి.

 సంగారెడ్డి జిల్లా: ఆంధోల్ నియోజకవర్గంలో పుల్కల్, ముల్‌పల్లి, రాయికూర్, రేగోడు మండలాలు; నారాయణఖేడ్‌లో కల్హర్, కంగ్టి, మానూర్, నారాయణఖేడ్ మండలాలు; నర్సాపూర్‌లో హత్నూర; పటాన్‌చెరులో జిన్నారం, పటాన్‌చెరు; సంగారెడ్డిలో కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాలు; జహీరాబాద్‌లో జరాసంగం, కోహిర్, న్యాలకల్, జహీరాబాద్ మండలాలు ఉన్నాయి.

 మెదక్ జిల్లా: ఆంధోల్ నియోజకవర్గంలో అల్లాదుర్గ్, రేగోడు, టేక్మాల్ మండలాలు; దుబ్బాకలో చేగుంట; గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ మండలం; మెదక్‌లో మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట(ఆర్), శంకరంపేట(ఏ) మండలాలు; నర్సాపూర్‌లో కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, శివంపేట, వెల్దుర్తి మండలాలు; ఎల్లారెడ్డిలో నాగిరెడ్డిపేట, మెదక్‌లో హవేలీ ఘన్‌పురం మండలం ఉన్నాయి.    

 సిద్ధిపేట జిల్లా: దుబ్బాక నియోజకవర్గంలో దౌలతాబాద్, దుబ్బాక, మిర్‌దొడ్డి, తొగుట మండలాలు; గజ్వేల్‌లో గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, వర్గల్ మండలాలు; హుస్నాబాద్‌లో హుస్నాబాద్, కొహెడ మండలాలు; జనగామలో చేర్యాల, మద్దూరు మండలాలు; సిద్దిపేటలో చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట మండలాలు ఉన్నాయి.

 మహబూబ్‌నగర్ జిల్లా: దేవరకద్ర నియోజకవర్గంలో అడ్డాకల్, బూత్పూర్, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాలు; జడ్చర్లలో బాలానగర్, జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్‌పేట మండలాలు; మహబూబ్‌నగర్‌లో హన్వాడ, మహబూబ్‌నగర్ మండలాలు; మక్తల్‌లో మాగనూర్, మక్తల్, నర్వ, ఉట్కూర్ మండలాలు; నారాయణపేటలో కోయిల్‌కొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణ పేట మండలాలు; షాద్‌నగర్‌లో ఫరూక్‌నగర్, కేశంపేట, కొందుర్గు, కొత్తూరు మండలాలు ఉన్నాయి.

 వనపర్తి జిల్లా: అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, ఐజ, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి మండలాలు; దేవరకద్రలో కొత్తకోట, గద్వాలలో ధరూర్-1, గద్వాల, గట్టు, మల్దకల్ మండలాలు; కొల్లాపూర్‌లో పానగల్, వీపనగండ్ల మండలాలు; మక్తలోలో ఆత్మకూరు; వనపర్తిలో ఘనపూర్, గోపాల్‌పేట, పెబ్బెరు, పెద్దమందడి,వనపర్తి మండలాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement