తొమ్మిది మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు | Nine national best teacher awards | Sakshi
Sakshi News home page

తొమ్మిది మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

Aug 30 2016 2:40 AM | Updated on Aug 20 2018 9:16 PM

తొమ్మిది మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు - Sakshi

తొమ్మిది మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

రాష్ట్రానికి చెందిన 9 మంది టీచర్లను కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 9 మంది టీచర్లను కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఎంపికైన వారి పేర్లను మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రాథమిక పాఠశాలల నుంచి నలుగురిని, ఉన్నత పాఠశాలల నుంచి ముగ్గురిని, సీబీఎస్‌ఈ స్కూళ్ల నుంచి ఇద్దరిని ఎంపిక చేసింది.

 ప్రైమరీ స్కూల్ టీచర్లు..
► బొల్లేపల్లి మధుసూదనరాజు, స్కూల్ అసిస్టెంట్, ఎంపీయూపీఎస్, సిద్ధారం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా
► ఆర్ రమేశ్ బాబు, సెకండరీ గ్రేడ్ టీచర్, యూపీఎస్ గంజాల్, నిర్మల్, ఆదిలాబాద్
► మీనపురెడ్డి బుచ్చిరెడ్డి, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్ మాస్టర్, ఎంపీపీఎస్ దోనూరు, మిడ్జిల్ మండలం, మహబూబ్‌నగర్
► కె.గోవింద్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్, సీపీఎస్ కందనెల్లి, పేద్దేముల్ మండలం, రంగారెడ్డి

 ఉన్నత పాఠశాలల టీచర్లు...
►మంగనూర్ వెంకటేశ్, జీహెచ్‌ఎంసీ, జెడ్పీహెచ్‌ఎస్ ముదుమల్, మగనూర్ మండలం, మహబూబ్‌నగర్
►తూము శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్‌ఎస్ పిల్లలమర్రి, సూర్యాపేట్ మండలం, నల్లగొండ
►పరికిపండ్ల వేణు, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్‌ఎస్ పులుకుర్తి, ఆత్మకూరు మండలం, వరంగల్

 సీబీఎస్‌ఈ టీచర్లు..
►రంగి సత్యనారాయణ, టీజీటీ, (సంస్కృతం), కేంద్రియ విద్యాలయ నం.1, ఉప్పల్, రంగారెడ్డి జిల్లా
►ఎం.వరలక్ష్మి, ప్రిన్సిపాల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement