ఎన్‌సీడబ్ల్యూ బహిరంగ విచారణ | ncw enquiry started on thursday | Sakshi
Sakshi News home page

ఎన్‌సీడబ్ల్యూ బహిరంగ విచారణ

Jun 29 2017 6:09 PM | Updated on Sep 5 2017 2:46 PM

జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ)కు అందిన ఫిర్యాదులపై కమిషన్‌ సభ్యురాలు సుష్మా సాహు గురువారం బహిరంగ విచారణ చేపట్టారు.

హైదరాబాద్‌: జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ)కు అందిన ఫిర్యాదులపై కమిషన్‌ సభ్యురాలు సుష్మా సాహు గురువారం బహిరంగ విచారణ చేపట్టారు. 2016-17 కాలంలో సైబర్‌ క్రైం, గృహహింసకు సంబంధించి నమోదైన 58 కేసుల పరిష్కారంపై విచారణ చేపట్టి 30 వరకు కేసులను పరిష్కారించారు.  మరో 10 కేసులపై విచారణ కొనసాగుతోంది.

వీటితోపాటు మరో 18 కేసులు హైదరాబాద్‌ న్యాయ అధికారుల పరిధికి మించినవి. తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని సుష్మా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ స్వాతి లక్రా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement