రెండేళ్ల చిన్నారితో కలిసి భవనం పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: రెండేళ్ల చిన్నారితో కలిసి 14 అంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న రేణుక(34) తన రెండేళ్ల కూతురు ఐశ్వర్యతో కలిసి 14వ అంతస్తు భవనం పై నుంచి దూకింది.
దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.