'మొగలి రేకులు' హీరో పోలీసులకు ఫిర్యాదు | Mogalirekulu fame sagar complaint against fake facebook account | Sakshi
Sakshi News home page

'మొగలి రేకులు' హీరో పోలీసులకు ఫిర్యాదు

Apr 28 2014 8:30 AM | Updated on Jul 26 2018 5:21 PM

'మొగలి రేకులు' హీరో పోలీసులకు ఫిర్యాదు - Sakshi

'మొగలి రేకులు' హీరో పోలీసులకు ఫిర్యాదు

తన పేరుతో ఓ యువకుడు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నాడని ‘మొగలి రేకులు’ టీవీ సీరియల్ కథానాయకుడు సాగర్ ఫిర్యాదు చేశాడు.

 హైదరాబాద్: తన పేరుతో ఓ యువకుడు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నాడని ‘మొగలి రేకులు’ టీవీ సీరియల్ కథానాయకుడు సాగర్ మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐ నర్సింహులు తెలిపిన ప్రకారం...ఖమ్మం జిల్లా కొల్లూర్‌కు చెందిన గోపీనాథ్ బికాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ‘మొగలి రేకులు’ కథానాయకుడు సాగర్ పేరిట నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు.

 ప్రొఫైల్‌లో సాగర్ ఫొటో పెట్టాడు. దీంతో పలువురు యువతీ యువకుల నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి. వాటన్నింటినీ కన్‌ఫార్మ్ చేసిన గోపీనాథ్... తానే సాగర్ నాయుడునని చెప్పుకున్నాడు. మూడు నెలలుగా ఎంతో మంది యువతులతో ఆన్‌లైన్‌లో చాటింగ్‌తో పాటు ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.   విషయం తెలుసుకున్న  హీరో సాగర్ శనివారం రాత్రి మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 419,420, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement