ఫలించిన కేటీఆర్ వ్యూహం.. | Ktr to speak directly with the Rebels | Sakshi
Sakshi News home page

ఫలించిన కేటీఆర్ వ్యూహం..

Jan 22 2016 1:10 AM | Updated on Sep 3 2017 4:03 PM

ఫలించిన కేటీఆర్ వ్యూహం..

ఫలించిన కేటీఆర్ వ్యూహం..

బల్దియా ఎన్నికల్లో రెబల్స్ ను దారికి తెచ్చుకునేందుకు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్....

120 డివిజన్లలో రెబల్స్‌తో నేరుగా మాట్లాడిన కేటీఆర్
 600 మంది నామినేషన్ల ఉపసంహరణ

 
సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల్లో రెబల్స్ ను దారికి తెచ్చుకునేందుకు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అమలు చేసిన వ్యూహం ఫలించింది. గత మూడు రోజులుగా 120 డివిజన్లలో టీఆర్‌ఎస్ రెబల్స్‌గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను మంత్రి తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించారు. దీంతో సు మారు 600 మంది అసంతృప్తులు నామినేషన్లను ఉపసంహరిం చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థులకు...అసంతృప్తులకు నచ్చజెప్పి... కలిసి పని చేయాలని సూచించారు.
 
ఇదే కసరత్తు
నామినేషన్ల గడువు పూర్తయిన వెంటనే డివిజన్ల వారీ గా సమన్వయకర్తలను నియమించి... పార్టీ తరఫున నామినేషన్లు వేసిన వారిని మంత్రి కేటీఆర్ గుర్తించారు. గత మూడు రోజులుగా ఇదే కసరత్తు చేశారు. అసంతృప్త నేతలతో మాట్లాడాల్సిందిగా వారికి సూచిం చారు. వారితోపాటు పార్టీ ఇన్‌చార్జులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో బుజ్జగింపుల పర్వం కొనసాగించారు. టిక్కెట్ రాక తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనైన నేతలను ప్రత్యేకంగా బేగంపేట్‌లోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. గ్రేటర్ వ్యాప్తంగా 90 శాతం మంది రెబల్స్ మంత్రి సూచనల మేరకు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలిపారు.

మూడు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థుల మార్పు
సిటీబ్యూరో: నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడు డివిజన్లలో ఇప్పటికే అభ్యర్థులుగా ప్రకటించిన వారిని పక్కనపెట్టి వేరొకరికి బి-ఫారాలు అందజేయడం చర్చనీయాంశమైంది. వివేకానందనగర్ డివిజన్ నుంచి తొలుత స్వాతిని పార్టీ అభ్యర్థిగా ప్రకటిం చినప్పటికీ... గురువారం మాధవరం లక్ష్మికి టిక్కెట్ ఇచ్చా రు. స్వాతికి స్థానికంగా ఓటు లేక ఆమె నామినేషన్ తిరస్కరణకు గురవడంతో అభ్యర్థి మార్పు తప్పలేదు. రాజకీయ కారణాల రీత్యా ఆల్విన్ కాలనీలో కొమురగోని వెంకటేశ్ గౌడ్ స్థానంలో దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌కు బి-ఫారం ఇచ్చారు. జగద్గిరిగుట్టలో శేఖర్ యాదవ్ స్థానంలో జగన్‌కు పార్టీ టిక్కెట్ ఇవ్వడం విశేషం. గతంలో ప్రకటించకుండా మిగి లిన కవాడిగూడ డివిజన్‌కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ న్న కుమార్తె లాస్య నందితకు చివరి నిమిషంలో బీఫారం ఇచ్చారు. కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి పారిజాతకు బి-ఫారం అందజేశారు. దీంతో మొత్తంగా గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement