టీపీసీసీ అధికార ప్రతినిధిగా కోటూరి | koturi As official representative of TPCC | Sakshi
Sakshi News home page

టీపీసీసీ అధికార ప్రతినిధిగా కోటూరి

Jul 7 2016 3:00 AM | Updated on Sep 19 2019 8:44 PM

టీపీసీసీ అధికార ప్రతినిధిగా కోటూరి - Sakshi

టీపీసీసీ అధికార ప్రతినిధిగా కోటూరి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా ఖమ్మం జిల్లాకు చెందిన కోటూరి మానవతారాయ్ నియమితులయ్యారు.

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా ఖమ్మం జిల్లాకు చెందిన కోటూరి మానవతారాయ్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో అందజేశారు. మానవతా రాయ్ ఓయూ జేఏసీ అధ్యక్షునిగా తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసి జైలు జీవితాన్ని అనుభవించారు. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆయన.. విద్యార్థి నిరుద్యోగ జేఏసీ స్థాపించి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పదవులు అలంకరించారు.

ఖమ్మం జిల్లా ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శిగా, ఓయూ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఏపీసీసీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. నాలుగున్నర ఏళ్లపాటు ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యునిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందిన ఆయన.. టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమితులు కావడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement