శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం అక్రమ రవాణా వెలుగుచూసింది.
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం అక్రమ రవాణా వెలుగుచూసింది. శుక్రవారం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారాన్ని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రయణాకిడి లగేజిని తనిఖీ చేయగా అందులో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.