
హైదరాబాద్: ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం శనివారం తెలిపారు. జూలై నాటికి అధ్యాపక ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి పర్మనెంట్ అధ్యాపకుల కొరతను తగ్గించనున్నట్లు చెప్పారు.
ఓయూలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 415 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. పలు విభాగాలలో సబ్జెక్టుల వారీగా రూలాఫ్ రిజర్వేషన్లు, ఇతర అంశాలను క్షుణ్నంగా పరిశీలించి త్వరలో(వచ్చే నెల) నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.