సీఎం పదవి ఇస్తామన్నా అందుకే వద్దన్నా: జానా | jana reddy slams congress leader to join TRS | Sakshi
Sakshi News home page

సీఎం పదవి ఇస్తామన్నా అందుకే వద్దన్నా: జానా

Jun 14 2016 1:43 PM | Updated on Mar 18 2019 9:02 PM

సీఎం పదవి ఇస్తామన్నా అందుకే వద్దన్నా: జానా - Sakshi

సీఎం పదవి ఇస్తామన్నా అందుకే వద్దన్నా: జానా

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపులు హేయమన చర్యగా ఆయన అభివర్ణించారు.

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై  కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపులు హేయమన చర్యగా ఆయన అభివర్ణించారు. టీఆర్ఎస్ అనైతిక రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జానారెడ్డి మంగళవారమిక్కడ మండిపడ్డారు. భ్రష్ట రాజకీయాలతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీని వీడినవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

ఫిరాయింపుల చట్టాన్ని కేంద్రం సవరించాల్సి ఉందని ఆయన అన్నారు. పార్టీ ప్రతిష్టత కోసం సీఎల్పీ పదవి వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జానారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నా తెలంగాణ కోసం తాను వద్దానన్నానని ఆయన తెలిపారు. కాగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్తో పాటు ఎమ్మెల్యే భాస్కరరావు కూడా ఈ నెల 15న టీఆర్ఎస్లో చేరనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement