జీతాలు పెంచమంటే జీవితాలపై కొడతారా..! | increase salaried workers of movement | Sakshi
Sakshi News home page

జీతాలు పెంచమంటే జీవితాలపై కొడతారా..!

Jul 25 2015 12:03 AM | Updated on Sep 3 2017 6:06 AM

జీతాలు పెంచమంటే జీవితాలపై కొడతారా..!

జీతాలు పెంచమంటే జీవితాలపై కొడతారా..!

కార్మికులు కడుపు మాడి జీతాలు పెంచమని ఉద్యమం చేస్తే వారి జీవితాలపై కొడతారా అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్

ఉప్పల్: కార్మికులు కడుపు మాడి జీతాలు పెంచమని ఉద్యమం చేస్తే వారి జీవితాలపై కొడతారా అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పోరాటానికి మద్దతుగా శుక్రవారం  ఉప్పల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సీపీఎం,సీఐటీయూ, బీజేపీ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీపర్లు ఉద్యమం చేస్తే ఉద్యోగాలు తీసివేయడం దారుణమన్నారు. సకల జనుల సమ్మెలో అన్ని వర్గాల ఉద్యోగులు మూకుమ్మడి సమ్మెకు దిగినా ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించ లేదని గుర్తు చేశారు.

కారణం లేకుండా  కార్మికులను తొలగించడం దారుణమన్నారు. కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శామీర్‌పేట ధర్మారెడ్డి, మహంకాళి లక్ష్మన్, అశ్వథ్థామరెడ్డి, సుమన్ శర్మ, రావుల బాలకృష్ణ, రేవెల్లి రాజు, గోనే అంజయ్య, ఎనుముల మహేష్‌కుమార్, పవిత్ర, సీపీఎం నాయకులు మన్నె నర్సింహరెడ్డి, వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 కొనసాగుతున్న దీక్ష
 రాత్రిగడిచినా అధికారులెవరూ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే దీక్ష కొనసాగుతోంది. దీనికితోడు కార్మికులకు వంటా వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాత్రి అక్కడే భోజనాలు చేసి బస చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement