breaking news
Minister Nai narsinha Reddy
-
‘అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లోకి వస్తున్నారు’
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కాంగ్రెస్ నేతలు హోం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరి చేరిక సందర్భంగా తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదిలి పోతోందన్నారు. అందుకే దళిత ఎమ్మెల్యే అయిన బాలరాజుపై దాడి చేశారని, తమపై ఎస్సీ, ఎస్టీ వే ధింపుల కింద కేసు ఎక్కడ నమోదవుతుందోనని ముందు జాగ్రత్తగా ధర్నాలు, గొడవలు చేస్తున్నారని విమర్శించారు. -
జీతాలు పెంచమంటే జీవితాలపై కొడతారా..!
ఉప్పల్: కార్మికులు కడుపు మాడి జీతాలు పెంచమని ఉద్యమం చేస్తే వారి జీవితాలపై కొడతారా అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పోరాటానికి మద్దతుగా శుక్రవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సీపీఎం,సీఐటీయూ, బీజేపీ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీపర్లు ఉద్యమం చేస్తే ఉద్యోగాలు తీసివేయడం దారుణమన్నారు. సకల జనుల సమ్మెలో అన్ని వర్గాల ఉద్యోగులు మూకుమ్మడి సమ్మెకు దిగినా ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించ లేదని గుర్తు చేశారు. కారణం లేకుండా కార్మికులను తొలగించడం దారుణమన్నారు. కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శామీర్‌పేట ధర్మారెడ్డి, మహంకాళి లక్ష్మన్, అశ్వథ్థామరెడ్డి, సుమన్ శర్మ, రావుల బాలకృష్ణ, రేవెల్లి రాజు, గోనే అంజయ్య, ఎనుముల మహేష్‌కుమార్, పవిత్ర, సీపీఎం నాయకులు మన్నె నర్సింహరెడ్డి, వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న దీక్ష రాత్రిగడిచినా అధికారులెవరూ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే దీక్ష కొనసాగుతోంది. దీనికితోడు కార్మికులకు వంటా వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాత్రి అక్కడే భోజనాలు చేసి బస చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


