‘అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు’ | TRS has developed a watch ' | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు’

Sep 7 2015 12:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

‘అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు’ - Sakshi

‘అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు’

టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలకు చెందిన వారు టీఆర్‌ఎస్‌లో....

 హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలకు చెందిన వారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కాంగ్రెస్ నేతలు హోం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

వీరి చేరిక సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదిలి పోతోందన్నారు. అందుకే దళిత ఎమ్మెల్యే అయిన బాలరాజుపై దాడి చేశారని, తమపై ఎస్సీ, ఎస్టీ వే ధింపుల కింద కేసు ఎక్కడ నమోదవుతుందోనని  ముందు జాగ్రత్తగా ధర్నాలు, గొడవలు చేస్తున్నారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement