అత్తారింటికి వెళ్తే.. | If the film is .. | Sakshi
Sakshi News home page

అత్తారింటికి వెళ్తే..

Feb 1 2014 4:43 AM | Updated on Sep 2 2017 3:13 AM

మేనత్తను తన తాతయ్య వద్దకు తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడి చివరకు ఒప్పించి మెప్పించి తీసుకెళ్తాడు హీరో..

  • అల్లుడిని చితకబాదిన అత్త
  •  తాగిన మైకంలో చిందులు
  •  తీవ్రగాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అమాయక అల్లుడు
  •  కాటేదాన్,న్యూస్‌లైన్: మేనత్తను తన తాతయ్య వద్దకు తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడి చివరకు ఒప్పించి మెప్పించి తీసుకెళ్తాడు హీరో.. ఇది ఇటీవల వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఉద్దేశం. కానీ కట్టుకున్న భార్యను పంపించండి అత్తా..అని మర్యాదగా అడిగినందుకు తీవ్రంగా దాడిచేసింది ఇక్కడి అత్త. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బుద్వేల్‌లో జరిగింది. తాగిన మైకంలో అత్త చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన అల్లుడు చివరకు ఎలాగోలా బయటపడి పోలీసులను ఆశ్రయిం చాడు.

    వివరాలి ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన నర్సింహకు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన శంకరమ్మ కూతురితో మూడేళ్లక్రితం పెళ్లయ్యింది. పదిరోజుల క్రితం నర్సింహ భార్య పుట్టింటికొచ్చింది. కూలీ పనిచేసుకునే నర్సింహ తనభార్యను కాపురానికి పంపించాలంటూ శుక్రవారం నగరానికొచ్చి అత్త శంకర మ్మను కోరాడు.

    అంతే అప్పటికే తాగినమైకంలో ఉన్న అత్త నర్సింహపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. అంతటితో ఆగకుండా కొట్టి జేబులో ఉన్న డబ్బులు లాక్కొని ఏంచేసుకుం టావో చేసుకోపో..అని తరిమేసింది. నుదిటిపై తీవ్రగాయమై రక్తంరావడంతో అల్లుడు నర్సింహ అత్తపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్దఉన్న డబ్బులు లాక్కుందని, ఊరికివెళ్లేం దుకు ఎవరైనా చిల్లర డబ్బులిస్తే వెళ్లిపోతానంటూ పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతిఒక్కరినీ నర్సింహ వేడుకోవడం విస్మయానికి గురిచేసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement