నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించా | i surrender my son to police, says ravela kishore babu | Sakshi
Sakshi News home page

నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించా

Mar 8 2016 12:48 PM | Updated on Aug 18 2018 5:18 PM

నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించా - Sakshi

నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించా

ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు కొడుకు రావెల సుశీల్ తాగినమైకంలో ఓ యువతి చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు ప్రయత్నించిన ఘటన అసెంబ్లీలో చర్చకు వచ్చింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు కొడుకు రావెల సుశీల్ తాగినమైకంలో ఓ యువతి చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు ప్రయత్నించిన ఘటన అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మంగళవారం అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. మంత్రి కిశోర్ బాబు మాట్లాడుతూ.. తన కుమారుడు తప్పు చేసివుంటే ఎలాంటి శిక్షకయినా సిద్ధమని అన్నారు.

తన కొడుకు సుశీల్ను తానే పోలీసులకు అప్పగించానని మంత్రి చెప్పారు. తన కొడుకును విచారించమని, తప్పు చేసివుంటే శిక్షించమని చెప్పానని తెలిపారు. తన కొడుకుపై ఆరోపణలు చేసిన యువతి తనకు కూతురుతో సమానమని చెప్పారు. ఆమె పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించినా శిక్షించాల్సిందేనని అన్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో సుశీల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement