హైదరాబాద్ రామాంతపూర్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా తీసుకెళ్లారు. దొంగిలించిన సొత్తు మొత్తాన్ని అదే కారులో వేసుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ రామాంతపూర్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇక్కడి శ్రీనివాసపురంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి దాదాపు 25 తులాల బంగారం, నాలుగు కేజీల వెండి, ఓ కారు, భూమి పత్రాలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇంటి తాళాలను పగులగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా తీసుకెళ్లారు. దొంగిలించిన సొత్తు మొత్తాన్ని అదే కారులో వేసుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని బుచ్చిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు.