
పెట్రోల్ బంకుల్లో జనం క్యూ..
రూ. 500, 1000 నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు
హైదరాబాద్: రూ. 500, 1000 నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జేబులో రూ. 500, 1000 నోట్లు తప్ప చిల్లరలేని వారు.. అవి ఎందుకు పనికిరాకపోవడంతో రోజు వారి అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. తరువాత నోట్లను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఉన్న కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చిల్లర కోసం నానా తంటాలు పడుతున్నారు.
పెట్రోల్ బంకుల వద్ద రూ. 500, 1000 నోట్లను మార్చడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ సైతం వారికి నిరాశే ఎదురౌతుంది. బంకుల నిర్వాహకులు సరైన చిల్లర ఇస్తేనే పెట్రోల్ పోస్తామని చెబుతున్నారు. అందరూ 500, 1000 నోట్లను మార్చుకోవడానికి పెట్రోల్ కోసం వస్తుండటంతో.. చిల్లర లేదని వారు అంటున్నారు. రూ. 500, 1000 నోట్లను తీసుకోవడానికి బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు.