 
															దిక్కుమాలిన సమ్మె అంటారా?
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను టీఆర్ఎస్ అడ్డుకుంటామని చెప్పడం సరికాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు.
	హైదరాబాద్: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను టీఆర్ఎస్ అడ్డుకుంటామని చెప్పడం సరికాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. అడ్డుకుంటే దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు.
	
	ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...  దిక్కుమాలిన సమ్మెలంటూ కరీంనగర్ లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దళితులను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య కార్మికుల్లో ఎక్కుమంది దళితులేనని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రే... దిక్కుమాలిన సమ్మె అంటున్నారని వాపోయారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
