'గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదు' | GHMC commissioner speaks over NOTA option in GHMC Elections | Sakshi
Sakshi News home page

'గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదు'

Jan 23 2016 6:11 PM | Updated on Sep 3 2017 4:10 PM

'గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదు'

'గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదు'

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ....గ్రేటర్ ఎన్నికల బరిలో మొత్తం 1333 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు.

గ్రేటర్ పరిధిలో 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని... ఇప్పటి వరకు 13.87 లక్షల మంది ఓటర్లు స్లిప్పులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అత్యధికంగా జంగంమెట్ డివిజన్ నుంచి 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా 8 డివిజన్ల నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు జనార్థన్ రెడ్డి తెలిపారు.

ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా(నన్ ఆఫ్ ది ఎబవ్) ఆప్షన్ ఎన్నుకునే విధానాన్ని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను అమలులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement