డిసెంబర్ 28న నాలుగు కొత్త పాలసీలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు.
హైదరాబాద్: ఈ నెల 28న నాలుగు కొత్త పాలసీలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనున్నట్టు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన సాప్ట్వేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఇమేజ్ సెంటర్ను ప్రారంభించనున్నట్టు చెప్పారు.
ఐటీ, ఇన్నోవేషన్, హార్డ్ వేర్, ఇమేజ్ పాలసీలను ప్రభుత్వం ప్రకటించనున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. స్టార్టప్ యానిమేషన్ కంపెనీలకు ఈ ఇమేజ్ సెంటర్ చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.