శంషాబాద్లో మరో ఐదున్నర కిలోల బంగారం! | five and half kilos of gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో మరో ఐదున్నర కిలోల బంగారం!

Apr 2 2014 8:17 AM | Updated on Sep 2 2017 5:29 AM

శంషాబాద్లో మరో ఐదున్నర కిలోల బంగారం!

శంషాబాద్లో మరో ఐదున్నర కిలోల బంగారం!

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం దొరికింది. హైదరాబాద్ కొత్తపేట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు సింగపూర్ నుంచి వస్తూ ఐదున్నర కిలోల బంగారం బిస్కట్లు తెస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం దొరికింది. హైదరాబాద్ కొత్తపేట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు సింగపూర్ నుంచి వస్తూ ఐదున్నర కిలోల బంగారం బిస్కట్లు తెస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చే విమానంలో రాత్రి 12.30 గంటల ప్రాంతంలో వీళ్లు దిగారు. విజిటింగ్ వీసాపై మూడు రోజుల క్రితమే సింగపూర్ వెళ్లిన ఈ ముగ్గురూ కేవలం బంగారం తేవడానికే వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిపై కేసు నమోదుచేసి జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది.

విదేశాల నుంచి తెల్లవారుజామున వస్తున్న ప్రయాణికులు ఏదోరకంగా బంగారాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయం కావడంతో ఎలాగోలా తప్పించుకుని వెళ్లిపోవచ్చన్నది వీరి భావనగా కనిపిస్తోంది. మంగళవారమే ఆరు కిలోల బంగారం పట్టుకున్న అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో దాదాపు ప్రతిరోజూ ఎంతోకొంత బంగారం దొరుకుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement