టీడీపీ తీర్థం పుచ్చుకున్న 'కిరణ్' బంధువు | EX. CM kiran kumar reddy colse relative Ex. mla Kalicherla Prabhakar Reddy join in tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ తీర్థం పుచ్చుకున్న 'కిరణ్' బంధువు

Apr 1 2014 1:05 PM | Updated on Jul 29 2019 5:31 PM

చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలికిచర్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలికిచర్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లో టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి కలికిచర్ల ప్రభాకర్ రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం.

 

కిరణ్ కుమార్ రెడ్డికి కలికిచర్ల ప్రభాకర్ రెడ్డి వరుసకు బావమరిది అవుతారు. అయితే కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిన్నమనేని వెంకటేశ్వర రావు, మండలి బుద్ధ ప్రసాద్లు బుధవారం టీడీపీ కండువా కప్పుకోనున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement