విద్యార్థిని ఆత్మహత్య | distressed over studies student commit suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Dec 12 2016 7:34 PM | Updated on Nov 6 2018 7:56 PM

నేరేడ్‌మెట్ వినాయక్‌నగర్‌లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్: నేరేడ్‌మెట్ వినాయక్‌నగర్‌లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వినాయక్‌నగర్‌కు చెందిన జి.వెంకటేష్ అనే ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె ధనలక్ష్మి కుషాయిగూడలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. కాగా, ఆదివారం అర్ధరాత్రి తన గదిలో చున్నీతో ఉరివేసుకుంది. సోమవారం ఉదయం ఆమె తల్లి గమనించేసరికి గదిలో పైకప్పుకు వేలాడుతూ కనిపించింది.
 
చదువుపై ఆసక్తి లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె మూడు నెలలుగా కాలేజీకి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement