పలు కార్యాలయాలపై లేబర్ కమిషనర్ దాడులు | Deputy Labour Commissioner riding on private institutions at Madhapur | Sakshi
Sakshi News home page

పలు కార్యాలయాలపై లేబర్ కమిషనర్ దాడులు

Apr 30 2014 10:32 AM | Updated on Aug 14 2018 5:54 PM

నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో సెలవు రోజున తెరచి ఉంచిన కార్యాలయాలపై డిప్యూటీ లేబర్ కమిషనర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు.

నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో సెలవు రోజున తెరచి ఉంచిన కార్యాలయాలపై డిప్యూటీ లేబర్ కమిషనర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా తలుపు మూసి సిబ్బందితో పని చేయిస్తున్న కార్వీ కన్సల్టేన్సీతోపాటు నారాయణ టెక్నో స్కూల్పై కేసు నమోదు చేసి.... సిబ్బందిని బయటకు పంపారు.

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బుధవారం సెలవు ప్రకటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఉన్నతాధికారుల ఆదేశాలను కొన్ని సంస్థలు పెడచెవిన పెట్టి... కార్యాలయాలు యాథావిధిగా పని చేస్తున్నాయి. దాంతో కార్యాలయాలపు పని చేస్తున్నట్లు సమాచారం రావడంతో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement