నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక

నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక


హైదరాబాద్ : ఫోటోలో కనిపిస్తున్న దోశ పేరు ప్రతిష్టలున్న నిమ్స్ ఆస్పత్రిలోని బెల్సన్ తాజ్ క్యాంటీన్లో తయారైంది. బుధవారం రాత్రి నిమ్స్ సెమీస్కిల్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగి ఈశ్వర్ సింగ్ కోసం తయారు చేసిన ఈ దోశలో బొద్దింక దర్శనమిచ్చింది. తాజ్ హోటల్ను తలదన్నేలా రేట్లున్నా శుబ్రత లేకపోవడం వల్లే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితుడు ఆవేదన వ్య్తక్తం చేశాడు.ఈ ఘటనపై నిమ్స్లో యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం నిమ్స్ ఔట్ పోలీసులు ఈ క్యాంటీన్లో భోజనం తెచ్చుకొని తింటుండగా అందులో రెండు పురుగులు కనిపించాయి. దాంతో నిమ్స్ ఆస్పత్రి క్యాంటీన్లో భోజనం చేయాలంటేనే రోగులు, వారి బంధువులు, వైద్యులు, సిబ్బంది హడలిపోతున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top