పాస్పోర్టు మర్చిపోయిన పైలెట్.. నిలిచిన విమానం | daman bound flight stranded in shamshabad airport | Sakshi
Sakshi News home page

పాస్పోర్టు మర్చిపోయిన పైలెట్.. నిలిచిన విమానం

Aug 10 2016 9:57 AM | Updated on Sep 4 2017 8:43 AM

పైలెట్ తన పాస్‌పోర్టు మర్చిపోయాడు. దీంతో విమానం దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది.

హైదరాబాద్ : పైలెట్ తన పాస్‌పోర్టు మర్చిపోయాడు. దీంతో విమానం దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా డామన్ వెళ్లాల్సిన విమానం బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే విమానం పెలైట్ తన పాస్‌పోర్టును వెంట తెచ్చుకోవటం మర్చిపోయాడు.

విమానాశ్రయ అధికారుల తనిఖీలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ విషయాన్ని వెంటనే బెంగళూరు ఎయిర్పోర్టు అధికారులకు తెలిపారు. దాంతో సదరు పైలెట్ పాస్ పోర్టును మరో విమానంలో బెంగళూరు నుంచి తెప్పించారు. దీంతో విమానం ఆ తర్వాత డమన్ బయలుదేరింది. దీంతో విమానం దాదాపు 5 గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement