breaking news
aeroplane pilot
-
కూలిన శిక్షణ విమానం..ఇద్దరు పైలట్లు మృతి
-
పాస్‌పోర్టు మర్చిపోయిన పైలెట్.. నిలిచిన విమానం
హైదరాబాద్ : పైలెట్ తన పాస్‌పోర్టు మర్చిపోయాడు. దీంతో విమానం దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా డామన్ వెళ్లాల్సిన విమానం బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే విమానం పెలైట్ తన పాస్‌పోర్టును వెంట తెచ్చుకోవటం మర్చిపోయాడు. విమానాశ్రయ అధికారుల తనిఖీలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ విషయాన్ని వెంటనే బెంగళూరు ఎయిర్‌పోర్టు అధికారులకు తెలిపారు. దాంతో సదరు పైలెట్ పాస్ పోర్టును మరో విమానంలో బెంగళూరు నుంచి తెప్పించారు. దీంతో విమానం ఆ తర్వాత డమన్ బయలుదేరింది. దీంతో విమానం దాదాపు 5 గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు.


