సీఎల్పీ మీటింగ్‌లోనే చర్చిస్తా: సంపత్‌ | congress-mla-sampath-protest-over-own-party-leaders-behavior-at-assembly | Sakshi
Sakshi News home page

సీఎల్పీ మీటింగ్‌లోనే చర్చిస్తా: సంపత్‌

Mar 25 2017 4:37 PM | Updated on Mar 18 2019 9:02 PM

తనకు కలిగిన అవమానంపై కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌: తనకు కలిగిన అవమానంపై కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సీఎల్పీ మీటింగ్‌లోనే జరిగిన అంశంపై చర్చిస్తానన్నారు. తనను కలిసిన ఎమ్మెల్యేలకూ ఇదే విషయం చెప్పానన్నారు. సీఎల్పీ మీటింగ్ పై ఇంకా ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో.. వంశీచంద్‌కు మైక్‌ ఇవ్వాలని పదే పదే కోరిన జానారెడ్డి తనకు మైక్‌ ఇవ్వాలని అడగలేదంటూ సంపత్‌కుమార్‌ పార్టీపై అలిగిన విషయం విదితమే.
 

Advertisement
 
Advertisement
Advertisement