'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే' | ccs police questioned over TV actress Battula Vijaya Rani for fraud case | Sakshi
Sakshi News home page

'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే'

Apr 10 2014 12:42 PM | Updated on Sep 2 2017 5:51 AM

'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే'

'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే'

తోటి నటీనటులకు చిట్టీల పేరుతో శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి తాను రూ. 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అంగీకరించింది.

హైదరాబాద్ : తోటి నటీనటులకు చిట్టీల పేరుతో శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి  తాను రూ. 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు స్వయంగా అంగీకరించింది. బెంగళూరులో నిన్న విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అధిక వడ్డీకి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు వున్నాయి.

చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైన విషయం తెలిసిందే.   బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును  కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి.   కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది.

బత్తుల విజయరాణి, పాలరాజు, చిట్టీలు, టీవీ ఆర్టీస్టులు, tv artist, Battula Vijayarani, Palaraju, ccs police

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement