హైదరాబాద్ లో బిజేపీ గెలిస్తేనే అభివృద్ధి | BJP mahasampark abhiyan held at bagh lingampally | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో బిజేపీ గెలిస్తేనే అభివృద్ధి

Jun 6 2015 11:23 AM | Updated on Mar 28 2019 8:40 PM

హైదరాబాద్ లో బిజేపీ గెలిస్తేనే అభివృద్ధి - Sakshi

హైదరాబాద్ లో బిజేపీ గెలిస్తేనే అభివృద్ధి

హైదరాబాద్లో బిజేపీని గెలిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్లో బిజేపీని గెలిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం బాగ్లింగంపల్లిలో నిర్వహించిన బిజేపీ మహాసంపర్క్ అభియాన్లో కిషన్ రెడ్డి వెల్లడించారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిజేపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.  

ఆన్లైన్లో కొత్తగా సభ్యత్వాలు పొందిన వారిని ప్రత్యక్షంగా కలిసి పార్టీ సిద్ధాంతాలు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు భారతీయ జనతా పార్టీ మహాసంపర్క్ అభియాన్‌ను రూపొందించింది. మే 16 నుంచి జూలై 31 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ రోజు బాగ్లింగంపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement