హైదరాబాద్ రోయింగ్ క్రీడాకారుడు సాజి థామస్, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు.
న్యూఢిల్లీ: హైదరాబాద్ రోయింగ్ క్రీడాకారుడు సాజి థామస్, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అవార్డుల కమిటీ.. అర్జున అవార్డుకు ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేసింది.
అర్జున అవార్డుకు థామస్, అశ్విన్తో పాటు షూటర్ హీనా సిద్ధు, అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటూ లూకా (అథ్లెటిక్స్), గిరీశ (పారాలంపిక్స్), దిజు (బ్యాడ్మింటన్), గీతూ ఆన్ జోసె (బాస్కెట్ బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అనిర్బన్ (గోల్ఫ్), మమతా పూజారి (కబడ్డీ), అనక అలంకమని (స్వ్కాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణుబాల చాను (వెయిట్ లిఫ్టింగ్), సునీల్ రానా (రెజ్లింగ్) పేర్లను నామినేట్ చేశారు. కాగా ఖేల్రత్న అవార్డుకు ఎవరి పేరును సిఫారసు చేయలేదు.