
నేరారోపణలు ఉన్నవారికి అవార్డులా?
చారిత్రాత్మక బాబ్రీ మసీదు విధ్వంస అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీలకు భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం దుర్మార్గమని ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు.
- కేంద్రంపై ఎంపీ అసదుద్దీన్ ధ్వజం
హైదరాబాద్: చారిత్రాత్మక బాబ్రీ మసీదు విధ్వంస అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీలకు భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం దుర్మార్గమని ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు.
అయోధ్యలోని రామ జన్మభూమి వాస్తవాలు పేరుతో అబ్దుల్ రహీం ఖురేషీ రాసిన పుస్తకాన్ని ఆదివారం రాత్రి ఖిల్వత్‌లోని ఉర్దూ మస్కాన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ నేరారోపణల కేసులు ఎదుర్కొంటున్న వారికి అవార్డులతో సత్కరించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు రహీమొద్దీన్ అన్సారీ, జామే నిజామియా వీసీ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, జాఫర్ యాద్ జిలానీ పాల్గొన్నారు.