ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి | ABVP stages protest at MLA Quarters demanding | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

Aug 12 2014 11:41 AM | Updated on Nov 9 2018 4:46 PM

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ను ముట్టడించారు. విద్యార్ధుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని విద్యార్ధి సంఘాల నాయకులు ఆరోపించారు.

 

జీవో నెం 36ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement