చైన్ స్నాచర్ల నుంచి 6 కిలోల బంగారం స్వాధీనం | 6 kilos of gold seized from chain snatchers | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్ల నుంచి 6 కిలోల బంగారం స్వాధీనం

Dec 17 2014 5:12 PM | Updated on Sep 2 2017 6:20 PM

చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద 6.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస పెట్టి చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద 6.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబా, మీర్జా అజ్మద్ అలీబేగ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

వీరిద్దరిపై ఇప్పటికి 220 కేసులున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వీరిద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబాపై ఇప్పటికి 106 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగులో ఉన్నాయని పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement