
సాక్షి, హైదరాబాద్: ఏవోసీ కంటోన్మెంట్ ఏరియా గఫ్ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మించేందుకు 5 ప్రతిపాదనలు రూపొందించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. శనివారం సచివాలయంలో గఫ్ రోడ్, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, మిలటరీ భూ సమస్యలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతిపాదిత రోడ్లకు అయ్యే వ్యయం, భూసేకరణ అంశాలపై చర్చించారు.
మిలటరీ సెక్యూరిటీకి సంబంధించి లెన్సింగ్, మెడికల్, వాచ్ టవర్స్ శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సీఎస్ నివేదిక కోరారు. సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ ఎస్‌వి.ఆర్ చంద్రశేఖర్, బ్రిగేడియర్ యం.డి ఉపాధ్యాయ్, బ్రిగేడియర్ ప్రమోద్‌కుమార్ శర్మలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.