
ఎయిర్‌పోర్టులో 2.7 కిలోల బంగారం బిస్కెట్లు పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ :: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం బ్యాంకాక్, కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి లగేజీలో భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. దాంతో సదరు ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లు 2.7 కేజీలు ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.