మంత్రాల నెపంతో పెద్దమ్మను చంపేశారు! | Woman Killed in karimnagar Reportedly for Practicing Witchcraft | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో పెద్దమ్మను చంపేశారు!

Feb 22 2016 11:08 AM | Updated on Sep 3 2017 6:11 PM

మంత్రాలు చేస్తోందనే అనుమానంతో ఓ వృద్ధురాలిని గొంతుకోసి చంపారు.

మంత్రాలు చేస్తోందనే అనుమానంతో ఓ వృద్ధురాలిని గొంతుకోసి చంపారు. ఈ దారుణం కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(65) కుమారులు, కూతుళ్లకు పెళ్లిళ్లయి పోవటంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె మరిది కుటుంబ సభ్యులు తరచూ వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఇందుకు కారణం పెద్దమ్మ నర్సమ్మ మంత్రాలే కారణమని వారు అనుమానం పెంచుకున్నారు. ఒంటరిగా ఉండే నర్సమ్మను ఆదివారం రాత్రి గొంతుకోసి చంపారు. సోమవారం ఉదయం ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement