నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య | telugu student murdered in noida | Sakshi
Sakshi News home page

నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య

Oct 18 2015 9:29 AM | Updated on Sep 3 2017 11:10 AM

నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య

నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య

ఉత్తర ప్రదేశ్ నోయిడాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

నోయిడా : ఉత్తర ప్రదేశ్ నోయిడాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన సందేశ్ భాస్కర్(23)గా గుర్తించారు. నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో మెరైన్ సైన్స్లో విద్యను అభ్యసిస్తున్నాడు. స్థానిక అపార్ట్మెంట్లో తన మిత్రులైన నదీమ్, మధుర్ తో కలిసి ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 4.30 ని.లకు అమన్ అనే విద్యార్థి భాస్కర్ రూమ్కు వచ్చి బెల్ గొట్టాడు.ఆ టైమ్లో రూమ్లో భాస్కర్ ఒక్కడే ఉన్నాడు. భాస్కర్ తలుపు తీశాడు. ఒక్కసారిగా అమన్ భాస్కర్పై దాడికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగుసలాట జరిగింది. వెంటనే అమన్ తనతో పాటు తెచ్చుకున్న గన్తో భాస్కర్ తలపై కాల్చాడు. దీంతో భాస్కర్ అక్కడిక్కడే మృతి చెందాడు.

అమన్ అదే యూనివర్సిటీలో టూరిజం విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. భాస్కర్ రూమ్మేట్స్ ఇద్దరు అమేథీ యూనివర్సిటీ ఇద్దరు టూరిజం విద్యార్థులు. భాస్కర్కు అతని రూమ్మేట్స్ ద్వార అమన్తో పరిచయం ఉందని తెలుస్తోంది. ఏదైనా పెద్ద గొడవలు హత్యకు దారితీసి ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement